పడుకునే ముందు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అవేంటో తెలుసుకుందాం..

రాత్రి పడుకునే ముందు మేకప్ తొలగించడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పడుకుంటే చర్మం దెబ్బ తింటుంది. 

ముఖాన్ని శుభ్రం చేసుకునేందుకు వేడి నీటిని ఉపయోగించవద్దు. ఇలా చేస్తే చర్మం తేమ కోల్పోయి పొడిబారుతుంది. 

చలికాలంలో పడుకునే ముందు మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. 

ముఖానికి మాస్క్ వేసుకుని నిద్రపోవడం వల్ల చర్మం దెబ్బతింటుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.