లైఫ్‌లో గెలవాలంటే ఆత్మవిశ్వాసం తప్పనిసరి. తమపై తమకు నమ్మకం లేని వారు మానసికంగా బలహీనమవుతారు.

తమని తాము తక్కువగా భావించేవారు తెలీకుండా చేసే తప్పులు కొన్ని ఉన్నాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవేంటంటే.. 

నిత్యం అవతలి వారి మెప్పును ఆశించడం

ఉన్నతస్థాయికి ఎగబాకకుండా ఉన్నదానితో సరిపెట్టుకోవడం

వైఫల్యం చెందొచ్చనే భయంతో జీవితంతో రాజీ పడిపోవడం

సొంత అవసరాల కంటే ఇతరుల అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వడం. తిరస్కరణకు గురవ్వొచ్చన్న భయంలో కొందరు ఇలా చేస్తారు.

తమని తాము చులకన చేసుకోవడం, గతంలో తప్పులకు నిందించుకోవడం

సొంత ఆరోగ్యం, అందం గురించి పట్టించుకోకపోవడం

నిత్యం ఇతరులతో పోల్చుకుని కుంగిపోవడం.