వాలెంటైన్స్ వీక్ మొదలైంది. ఇక, ఫిబ్రవరి ఏడున రోజ్ డే జరుపుకుంటారు ప్రేమికులు.
గులాబీ పువ్వును ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. గులాబీ పువ్వు ప్రేమ, అందానికి మాత్రమే చిహ్నం కాదు.
అనేక అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. గులాబీ పువ్వుల్లో
విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి.
గులాబీ పువ్వుల్లో ఉపయోగించడం వల్ల చర్మపు మచ్చలు, బరువు తగ్గడం, మొటిమలు, ఇన్ఫెక్షన్లు, అలెర్జీ వంటి సమస్యలు తగ్గుతాయి.
ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు.
బరువు తగ్గడం కోసం 10 నుంచి 15 గులాబీ రేకులను నీటిలో వేసి నానబెట్టండి.
నీరు పూర్తిగా గులాబీ రంగులోకి మారినప్పుడు దానికి తేనె, దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేయండి.
ఈ నీటిని తాగాలి. ఇలా ఒక నెల రోజుల పాటు గులాబీ నీరు తాగడం వల్ల మీరు తేడాను గమనిస్తారు.
గులాబీ పువ్వు సమర్థవంతంగా పనిచేస్తుంది. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమల్ని తగ్గించడంలో సాయపడతాయి.
Related Web Stories
బ్రోకలీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవే..
ఇవి తింటే కొవ్వు తగ్గడంతో పాటు రక్త సరఫరా మెరుగుపడుతుంది..
ఈ సీజన్లో దొరికే ఈ పండు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..