చలికాలంలో పెదాలు స్మూత్‌గా ఉండాలంటే ఇవి చేయండి..

పుష్కలంగా నీరు తాగండి: రోజుకు సరిపడా నీరు తాగడం వల్ల పెదవులు పొడిబారకుండా ఉంటాయి.

పెదవులపై కొబ్బరి నూనె, బాదం నూనె లేదా పెట్రోలియం జెల్లీ వంటి వాటిని పలుచగా పూయడం వల్ల తేమను లాక్ చేయవచ్చు.

మృదువైన బ్రిస్టల్ టూత్ బ్రష్ లేదా చక్కెరతో చేసిన స్క్రబ్‌తో పెదవులను సున్నితంగా స్క్రబ్ చేయడం వల్ల చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి.

మీ గదిలో హ్యూమిడిఫైయర్ వాడటం వల్ల గాలిలో తేమ పెరుగుతుంది, ఇది మీ పెదవులను పొడిగా మారకుండా కాపాడుతుంది.

విటమిన్ బి, ముఖ్యంగా రిబోఫ్లావిన్ (B2) లోపం వల్ల పెదాలు పగుళ్లు వస్తాయి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని సరిచేసుకోవచ్చు

చలికాలంలో ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల కూడా పెదవులు పగిలిపోవచ్చు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి.

పెదవుల పొడిబారకుండా కాపాడటానికి మరియు తేమను అందించడానికి SPF ఉన్న లిప్ బామ్ ను ఎల్లప్పుడూ వాడండి.

 పెదాలు పొడిగా అనిపించినప్పుడు వాటిని నాలుకతో తడపడం వల్ల అవి మరింత పొడిగా మారతాయి. కాబట్టి ఈ అలవాటును మానుకోండి.