చలికాలంలో గుండెపోటు నివారించే  సింపుల్ చిట్కాలు..

ఇంట్లో క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.

ధూమపానం, మద్యం సేవించడం మానుకోవాలి. 

గుండె సమస్యలు ఉన్నట్లయితే నిశితంగా పరిశీలించి.. ఏదైనా చికిత్స లేదా మందులు తీసుకోవాలి.

మీ రక్తపోటును క్రమం తప్పుకుండా చెక్ చేసుకోవాలి. అలాంటి ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మీ శరీరాన్ని వెచ్చగా ఉంచాలి. చాలా తక్కువ ఉష్ణోగ్రతలో ముఖ్యంగా ఉదయం నడక కోసం బయటకు వెళ్లకుండా ఉండాలి.

అధిక కొలెస్ట్రాల్ స్థాయిలున్న కొవ్వు, వేయించిన, తీపి ఆహార పదార్థాలను నివారించాలి.