బ్రౌన్ రైస్ తో ఇన్ని లాభాలా..? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ప్రతి ఒక్కరు తినేది తెల్లబియ్యం. అయితే బ్రౌన్ రైస్‌ను కూడా తినేవారు చాలా మంది ఉంటారు. ఈ బ్రౌన్ రైస్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
బ్రౌన్ రైస్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో ఉపయోగపడుతుంది.
ఈ రైస్ మధుమేహం ఉన్నవారికి ఎంతో మంచిదంటున్నారు నిపుణులు.
బ్రౌన్ రైస్ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
అధిక బరువుతో బాధపడేవారు రోజూ రెండు పూటలా బ్రౌన్ రైస్‌ను తినాలి. దీంతో బరువును తగ్గించుకోవచ్చు.
పాలిచ్చే తల్లులు బ్రౌన్ రైస్‌ను తినడం వల్ల వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
బ్రౌన్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఇది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మతిమరుపు సమస్య తగ్గుతుంది.