జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్..
శీతాకాలంలో దగ్గు, జలుబు ఎక్కువగా వస్తాయి, ఎందుకంటే ఈ కాలంలో గాలి పొడిగా, చల్లగా ఉంటుంది. దీనికి తోడు, వైరస్‌లు తేలికగా వ్యాపిస్తాయి.
జలుబు, దగ్గు మందులతో మాత్రమే కాకుండా ఇంటి నివారణలతో కూడా నయం చేయవచ్చు. ముక్కు కారటం, గొంతులో కఫంతో ఇబ్బంది పడుతుంటే కొన్ని ఇంటి చిట్కాలతో వదిలించుకోవచ్చు..
శీతాకాలంలో జలుబు, దగ్గును నివారించడంలో యోగా ప్రభావవంతంగా ఉంటుంది. యోగా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
ఒక కప్పు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ అల్లం రసం.. ఒక టీస్పూన్ తేనె కలపండి. దీనిని రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే.. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కొన్ని తులసి ఆకులు, 2-3 ఎండు మిరియాలు వేసి మరిగించి, దానిని వడపోసి త్రాగాలి. ఇలా చేస్తే.. దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఒక గిన్నెలో నీటిని తీసుకుని బాగా మరిగించండి.. ఆ తర్వాత పసుపు వేసి.. ఆవిరి పట్టండి. ఇలా కొన్ని నిమిషాల పాటు ఆవిరి పట్టడం వల్ల.. ఇది ముక్కును క్లియర్ చేయడమే కాకుండా గొంతులో వాపును తగ్గిస్తుంది..
వేడి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా జలుబు, దగ్గు సమస్య కూడా తగ్గుతుంది.
వేడి పాలలో అర టీస్పూన్ పసుపు వేసి బాగా కలిపి నిద్రపోయే ముందు తాగాలి. ఇది గొంతుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.. శరీరం రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.