దాల్చిన చెక్క  ఎందుకు తినాలో తెలుసా.. 

దాల్చిన చెక్కలో ఉండే సమ్మేళనాలు మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. 

ఇది మెదడు సంబంధ జబ్బులైన అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి జబ్బుల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. 

రోజూ ఒక కప్పు దాల్చిన చెక్క నీరు తాగితే జీర్ణ సమస్యలే ఉండవు.

దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల ఆర్థరైటిస్, వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

శరీరంలో ఉండే అదనపు కొవ్వులను బర్న్ చేయడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది. 

వర్షాకాలంలో ఎదురయ్యే ఇన్ఫెక్షన్లు ఎదుర్కోవడంలోనూ, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలోనూ దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది.