అల్లంతో జుట్టు సమస్యలకు చెక్..

జుట్టు పెరుగుదల విషయానికి వస్తే, అల్లం ఒక శక్తివంతమైన పదార్ధం, దీనిలో ఎన్నో శక్తివంతమైన లక్షణాలన్నాయి.

 అల్లం తల చర్మం, జుట్టు కుదుళ్లకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. 

అల్లంలో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్, చుండ్రుని ఎఫెక్టివ్‌గా  తగ్గించడంలో సహాయపడతాయి.

షాంపూలో తాజా అల్లం కలుపుకుని తలకు మసాజ్ చేయడం వల్ల చుండ్రుతో బాధపడుతున్నవారికి ఉపశమనం ఉంటుంది. 

అల్లంలో అనేక విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టు నాణ్యతను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

అల్లంలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు జుట్టుకు పోషణను అందించడంలో ఉపయోగపడతాయి.