గొంతులో గరగర సమస్యా..?  ఈ చిట్కాలు పాటిస్తే చిటికెలో మాయం..!

వాతావరణంలో జరిగే మార్పుల వల్ల దగ్గు, జలుబు వంటి పలు ఆరోగ్య సమస్యలు రావడం సహజం.

విటమిన్ సి నిండిన పండ్లను తినడం వల్ల గొంతులో గరగరను తగ్గించుకోవచ్చు.

ఎలర్జీ వల్ల గొంతుకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు లేదా గొంతు వాచినప్పుడు.

కాసిన్ని గోరు వెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

రోజూ  ఏడెనిమిది గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.

గరగర సమస్యను తగ్గించుకునేందుకు గ్రీన్‌టీ ఎంతగానో ఉపయోగపడుతుంది.

అల్లం,శొంఠి,మిరియాలు, కొద్దిగా తులసి దళాలు  వేసి  కషాయంలా చేసుకొని తాగితే  ఉపశమనం లభిస్తుంది.