మంచి నీళ్లలో  వీటిని కలిపి తాగితే..  ఇన్ని లాభాలా..

 దనియాల గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తీసుకుంటే, అది Detoxification చేస్తుంది.

దనియాలలో ఉండే విటమిన్  ఎ కారణంగా కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

కొత్తిమీర నీరు పొట్టను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. 

జీలకర్ర మన వంటగదిలో ఒక సూపర్ పదార్ధం, ఇందులో విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, విటమిన్ సి, ఇ ఉంటాయి. 

జీలకర్రను రాత్రి నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే వేడిచేసి ఆ నీటిని సేవించడం వల్ల పొట్ట, చర్మ సంబంధిత సమస్యలన్నీ నయమవుతాయి. 

సోంపు నీరు  తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు  మెంతి నీరు దివ్యౌషధం. మెంతి గింజలను రాత్రి నానబెట్టి, ఉదయం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉంటుంది. 

దాల్చినచెక్క నీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.