ఎండాకాలంలో ఆరోగ్యంగా  ఉండాలంటే ఏం తీసుకోవాలి..

వాతావరణం వేడెక్కే కొద్దీ శరీరానికి ద్రవ పదార్థాలే ఎక్కువగా అవసరం.

ప్రతిరోజూ నిమ్మరసం తీసుకుంటూ ఉండాలి. ఇది ఎండ వేడి నుంచి తప్పిస్తుంది.

వేసవిలో మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి.

రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలి. లేదంటే శరీరం డీహ్రైడ్రేషన్ అవుతుంది.

 మజ్జిగ ఎక్కువగా తాగాలి. దీనివల్ల శరీరానికి క్యాల్షియం, ప్రోటీన్లు అందుతాయి.

కీరా ముక్కలు ఎక్కువగా తీసుకుంటే ఒంటికి చలువ చేస్తుంది.

సొరకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలను వినియోగించాలి.