వేసవిలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేళకు ఆహారం తీసుకోవాలని.. ఏది పడితే అది తినకూడదని చెబుతున్నారు.
వేయించిన మాంసం తీసుకోకూడదు. వీటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద వండుతారు. అలాంటి ఆహారం ఆరోగ్యకరం. ఇది క్యాన్సర్‌కు దారి తీయవచ్చు.
ఈ కాలంలో ఐస్ క్రీం తీసుకోవడం అంత మంచిది కాదు. వీటిలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది ఊబకాయం, మధుమేహంకు దారి తీయవచ్చు.
వేసవిలో చల్లనీ బీర్ తాగడానికి ఇష్టపడతారు. ఇవి తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతోంది. శరీరంలో నీటి పరిమాణం తగ్గుతోంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి తగ్గి, వ్యాధులు వస్తాయి.
వేసవిలో పాల ఉత్పత్తులు.. పాలు, వెన్న, జున్ను తదితర పదార్థాలకు దూరంగా ఉండండి.
నూనెతో చేసిన పదార్థాలు.. ముఖ్యంగా వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
సాధ్యమైనంత వరకు డ్రై ఫ్రూట్స్ తీసుకోక పోవడం ఉత్తమం. ఎందుకంటే.. ఎండిన పండ్లు శరీరంలో ఉష్ణోగ్రతలు పెంచుతాయి. అందువల్ల తీసుకోకుండా ఉంటే మంచిది.
టీ, కాఫీలు తాగకండి. కుదిరితే గ్రీన్ టీ తాగండి.
మసాలాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
వేసవిలో వచ్చే మామిడి పండ్లు చాలా తక్కువ మోతాదులో తీసుకోంటే మంచిది.
ఉప్పును చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే.. అధిక రక్త పోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా శరీరంలో సోడియం పేరుకుంటే.. మూత్రపిండాల సమస్య వచ్చే ప్రమాదం అధికం