పాలతో మామిడి పండు కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

మామిడి పండు జ్యూస్ లో పాలను కలపవచ్చు. లేదా మామిడి పండు ముక్కలలో పాలను పోసి మిక్సీ చేసి తీసుకోవచ్చు.

మామిడి రసంతో పాలను కలపడం వల్ల కాల్షియం, విటమిన్ డి చాలా సమృద్ధిగా ఉంటాయి.

ఎముకలు బలంగా,ఆరోగ్యంగా ఉండేలా చేయటమే కాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే నొప్పులను కూడా తగ్గిస్తుంది.

మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది.

బరువు పెరగాలని అనుకొనేవారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

రక్తహీనత సమస్య ఉన్నవారికి ఈ జ్యూస్ చాలా బాగా సహాయపడుతుంది

అజీర్తి సమస్యలు ఉన్నవారు ఈ పండును పాలతో కలిపి తినకూడదు.

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.