పిల్లల నుంచి పెద్దల వరకు  అందరూ దీనిని ఇష్టపడతారు.

పనీర్.. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి.

ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఎంతైనా తినేయాలని భావించడం పొరపాటు

 ఏ ఆహార పదార్థమైనా మితంగా తీసుకోవడం మంచిది.

పనీర్‌లో కొవ్వు ఎక్కువగా ఉండటంతో అధికంగా తింటే కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పనీర్ అధిక కేలరీలు కలిగి ఉంటాయి ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు తగ్గాలనుకునేవారు మితంగా తీసుకుంటే మంచిది.

పనీర్ తిన్న తర్వాత కడుపులో అసౌకర్యం, గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలు తలెత్తవచ్చు. అలాంటి వారు తక్కువ మొత్తంలో మాత్రమే తీసుకోవాలి.