పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తింటే కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయి.

ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ వల్ల కడుపుబ్బరం, గ్యాస్ తదితర ఇబ్బందులు వస్తాయి

కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆకలి తగ్గిపోతుంది. ఫలితంగా నీరసం ఎక్కువవుతుంది

త్వరగా జీర్ణంకాని ఫైబర్ వల్ల కొందరిలో మలబద్ధకం కూడా తలెత్తొచ్చు

కడుపులోని నీరు మొత్తాన్ని ఫైబర్ గ్రహించడం వల్ల డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది

శరీరం మినరల్స్‌ను గ్రహించకుండా పీచు పదార్థం అడ్డుపడి పోషకాల లోపానికి దారి తీయొచ్చు

పీచు పదార్థం త్వరగా అరగక కొందరికి కడుపు నొప్పి, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. 

ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు సమతుల ఆహారం ఒక్కటే పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు