టీ తాగేముందు నీళ్లు తాగితే? షాకింగ్ రిజల్ట్స్..!

చాలా మందికి ఉదయం నిద్రలేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. టీ లేకుండా వారి రోజు ప్రారంభం కాదు.

ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. టీకి ముందుగా నీళ్లు తాగితే ఏం జరుగుతుందో చూద్దాం.

ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు తొలగిపోతాయి.

టీ తాగే ముందు నీరు తాగడం వల్ల దంతాలపై మరకలు, క్యావిటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

నీళ్లు తాగాక టీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడి కొవ్వును కరిగించే ప్రక్రియ సక్రియం అవుతుంది.

అసిడిటీతో బాధపడేవారు టీ తాగే ముందు కచ్చితంగా నీరు తాగాలి. అప్పుడే కడుపులో యాసిడ్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది.

టీ తాగే ముందు నీరు తాగితే మెదడు పనితీరు మెరుగుపడి మానసిక ఉల్లాసం కలుగుతుంది.

నీరు తాగాక టీ తాగితే టీ రుచి బాగుంటుంది. కెఫీన్ వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం శరీరంపై పడదు.