గ్యాస్ సమస్య ఉందా.?
ఈ చిట్కాలు మీకోసమే..
తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, ఎక్కువగా ఫాస్ట్ పుడ్ తీసుకోవడం కారణం ఏదైనా ఇటీవల చాలా మంది కడుపులో గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
కొన్ని సహజ చిట్కాలను పాటించడం ద్వారా గ్యాస్ సమస్యను శాశ్వతంగా తరిమికొట్ట వచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇంగువ కడుపులోని గ్యాస్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.
గ్యాస్ సమస్య నుంచి బయటపడాలంటే కచ్చితంగా పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఆహారంలో పండ్లు, కూరగాయలను కచ్చితంగా భాగం చేసుకోవాలి. ఇలాంటి ఫుడ్‌ను నిత్యం తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు
జీర్ణ సమస్యలను తగ్గించేందుకు జీలకర్ర ఉపయోగపడుతుంది.
అల్లం, ఎండుమిర్చి, మిరియాలు కలిపిన త్రికటు చూర్ణం పరగడుపున తీసుకుంటే ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి.
బీన్స్, ఉల్లిపాయలు, క్యాబేజీ, కార్బొనేటెడ్ పానియాలకు దూరంగా ఉండండి. మసాల, వేపుడు పదార్థాలు తీసుకోకండి.
రోజూ ఒకే సమయానికి భోజనం చేయండి. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినండి.
రాత్రి నిద్రపోవడానికి రెండు గంటల ముందు భోజనం ముగించండి.
యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి.
Related Web Stories
ఖాళీ కడుపుతో వెల్లుల్లి, బెల్లం కలిపి తింటే డాక్టర్‌తో పని లేదు !
నీళ్లు తాగేటప్పుడు ఈ 4 తప్పులు మాత్రం చేయకండి..
ఒత్తిడి కారక కార్టిసాల్ హార్మోన్ ప్రభావాన్ని తగ్గించే ఫుడ్స్
గోంగూర.. మజాకా..