తినడానికి టైం కూడా లేని వారు చాలా మందే ఉన్నారు. కానీ ఫుడ్‌ను స్కిప్ చేయడం వల్ల మీరు ఎక్కువ సేపు వర్క్ చేయలేరు

ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ను స్కిప్ చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. దీంతో మనసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.

భోజనాన్ని చేయకపోవడం వల్ల మీలో కోపం పెరిగిపోతుంది. ఒత్తిడి ఎక్కువవుతుంది. ఇది ఫ్యూచర్‌లో మీ ప్రవర్తణలలో ఎన్నో మార్పులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు

ఆహారాన్ని తినకపోవడం వల్ల అలసట కలుగుతుంది.  ఇది మైకం, మైగ్రేన్ వంటి సమస్యలకు దారితీస్తుంది.  

భోజనాన్ని స్కిప్ చేస్తే మీ శరీరంలో ప్రోటీన్ల పరిమాణం తగ్గుతుంది.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మన శరీరానికి ఆ రోజుకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. శరీర పోషణను పెంచుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

అందుకే భోజనాన్ని స్కిప్ చేయకండి. ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయం సమతుల్య ఆహారాన్నే తినండి.