పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి, డీహైడ్రేషన్ బారి నుండి కాపాడుతుంది.

ఇందులో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.  గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

ఇందులో విటమిన్ 'A', 'C' పుష్కలంగా ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఎండ వల్ల చర్మం దెబ్బతినకుండా చూస్తుంది. 

ఇందులోని విటమిన్-A కంటి చూపు సమస్యలను నివారించడంలో  కీలక పాత్ర పోషిస్తుంది.

పుచ్చకాయలో పీచు పదార్థం, నీరు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మలబద్దకం సమస్యలను నివారిస్తుంది. 

 వ్యాయామం చేసేవారికి, ఎండలో తిరిగే వారికి తరచూ వచ్చే కండరాల నొప్పులను తగ్గించడంలో 'ఎల్‌-సిట్రులైన్' అనే అమైనో యాసిడ్ ఉపయోగపడుతుంది.