పుచ్చకాయలో 90 శాతం పైగా నీరు ఉంటుంది. అలాగే ఇందులో ఉండే ‘లైకోపిన్’ చర్మాన్ని ఎండ నుంచి రక్షిస్తుంది.

దోసకాయ ఇది చర్మాన్ని చల్లబరచడమే కాకుండా, శరీరంలోని మలినాలను బయటకు పంపి చర్మం మెరిచేలా చేస్తుంది.

మజ్జిగ ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, ప్రోబయోటిక్స్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడి ముఖంపై మొటిమలు రాకుండా చేస్తుంది. 

నారింజ, నిమ్మ వంటి వాటిలో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం ముడతలు పడకుండా చూస్తుంది. 

కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్స్ చర్మానికి మంచి మెరుపునిస్తాయి. వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు డీహైడ్రేషన్‌ తగ్గిస్తుంది.

క్యారెట్లలో ఉండే బీటా-కెరోటిన్ చర్మాన్ని సూర్యరశ్మి నుంచి వచ్చే UV కిరణాల నష్టం నుంచి కాపాడుతుంది.