ఫ్యాటీ లివర్ సమస్య..
ఈ పళ్లతో చెక్ పెట్టండి..
పంపర పనస పళ్లలో యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా నుంచి కాలేయాన్ని రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
యాపిల్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాలేయ కొవ్వును కరిగించడంలో నిర్విషీకరణ ప్రక్రియను సులభతరం చేయడంలో యాపిల్స్ సహాయపడతాయి.
అవకాడోలు ఆరోగ్యకర కొవ్వులను కలిగి ఉంటాయి. ఇవి కాలేయానికి రక్షక కవచంగా ఉండి మరింత నష్టం వాటిల్లకుండా కాపాడతాయి.
స్ట్రాబెర్రీలు, రాస్ బెర్రీలు, బ్లాక్ బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
విటమిన్లు, ఎంజైములు, సమృద్ధిగా ఉండే బొప్పాయి కాలేయంపై ఒత్తడిని తగ్గిస్తుంది. కాలేయం ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగు పరుస్తుంది.
బ్లూ బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లకు పవర్ హౌస్ వంటివి. ఇవి కాలేయంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్రను పోషిస్తాయి.
కివీ పళ్లు రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా కాలేయ ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి.
Related Web Stories
ఎన్నో పోషకాల రాగి పిండి.. ఎంత మేలు చేస్తుందంటే..
రోజూ నూడిల్స్ తింటే.. క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్టే..!
బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేయగల సామర్థ్యం వీటి సొంతం..
ఈ హెర్బల్ డ్రింక్స్.. ఎంత మేలు చేస్తాయంటే..