గులకరాళ్లపై వాకింగ్‌ చేస్తే   ఏమౌతుందో తెలుసా..?

 వాకింగ్‌ విధానంలో దేని ప్రయోజనాలు దానికే ఉంటాయి. కానీ, గులకరాళ్లపై నడిస్తే ఏమౌతుందో తెలుసా..?

గులకరాళ్లపై కాళ్లకు చెప్పులు లేకుండా నడవటం వల్ల మనం ఊహించని లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గులక రాళ్లపై నడక వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

 గులకరాళ్లపై నడిస్తే బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

గులకరాళ్లపై ఎలాంటి చెప్పులు, షూస్‌ లేకుండా నడవడం వల్ల పాదాల్లోని నాడీ ముద్రలను ఉత్తేజితం చేసి రక్త ప్రసరణను పెంచుతుంది.

పాదాల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రతి రోజు 10 నిమిషాలు గులకరాళ్లపై నడవటం అలవాటు చేసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.