చాలామంది వ్యక్తులు ఉదయాన్నే లేవడం వల్ల కాస్త త్వరగా పనులు అవుతాయి. అలాగే రోజంతా తాజాగా ఉంటారు.

చేసే పనుల్లో ఒత్తిడి లేకుండా ఉంటుంది. అలాగే రోజులో చాలా సమయం ఉన్నట్టు కనిపిస్తుంది.

దానితో పాటు శరీరానికి తగిన వ్యాయామాన్ని అందించవచ్చు. ఇది శ్రమచేయగలిగే శక్తిని శరీరానికి ఇస్తుంది.

రోజును ముందుగానే మొదలుపెట్టినట్టు అనిపిస్తుంది. దీనితో పాటు ధ్యానం, వ్యాయామం వంటి చేసే వీలు, సమయం ఉంటాయి.

త్వరగా మేల్కొవడం అంటే త్వరగా నిద్రకు ఉపక్రమించాలి. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది. మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుంది.

తొందరగా మేల్కోవడం వల్ల ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడానికి సమయం ఉంటుంది. రోజంతా ఏకాగ్రత పెరుగుతుంది. మరిచిపోవడం అనే సమస్య ఉండదు.

త్వరగా నిద్రలేవడం అనేది శరీరకంగా, మానసికంగా ఒత్తిడిని తగ్గిస్తుంది.

రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.