చలి ఎక్కువగా వేస్తోందంటే  ఈ సమస్య ఉన్నట్టే..

ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు చలి వేయడం సహజం. 

 అయితే, ఇతరుల కంటే ఎక్కువగా చలి వేస్తోందంటే ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు అనుమానించాలి.

ముఖ్యంగా విటమిన్ లోపాలు ఉన్నప్పుడు ఇలా అధికంగా చలి వేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

రక్త కణాల ఉత్పత్తికి, మెదడు పని తీరుకు బీ12 విటమిన్ కూడా కీలకం.

 ఇది తక్కువైనప్పుడు ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గి రక్తహీనత వస్తుంది. ఫలితంగా చలి ఎక్కువైనట్టు అనిపిస్తుంది.

హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు ఆక్సీజన్ సరఫరా కుంటుపడుతుంది. దీంతో, కండరాలు, కణజాలం కావాల్సిన వేడిని ఉత్పత్తి చేయలేవు. 

దీంతో, మనకు చలివేస్తున్నట్టు అనిపిస్తంది.