పొరపాటున కూడా  వీటిని పచ్చిగా తినకూడదు..

ఉడకని బంగాళాదుంపలు రుచిలో తేడాగా ఉండటమే కాకుండా జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తాయి. 

క్యాబేజీ కుటుంబానికి చెందిన కాలీఫ్లవర్, బ్రస్సెల్స్, బ్రోకలీ, మొలకలు వంటి కూరగాయలను ఎప్పుడూ పచ్చిగా తినకూడదు. 

పుట్టగొడుగులను పచ్చిగా తినవచ్చు, అయినప్పటికీ, ఎక్కువ పోషకాలను పొందాలంటే మాత్రం ఉడికించిన వాటిని తీసుకోవడం మంచిది.

ఉడికించని బీన్స్‌లో పెద్ద మొత్తంలో టాక్సిన్, గ్లైకోప్రొటీన్ లెక్టిన్ ఉంటుంది.

ఇది తిన్న కొన్ని గంటల్లోనే వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలకు దారితీస్తుంది.

పచ్చి, తక్కువగా ఉడికించిన మాంసం, చికెన్, టర్కీ తినడం చాలా ప్రమాదకరం.  ఇది ఆరోగ్యాన్ని త్వరగా పాడు చేస్తుంది.