వాల్‌నట్స్‌ను నానబెట్టే  ఎందుకు తినాలి..

వాల్నట్స్ ను సాధారణంగా బ్రెయిన్ ఫుడ్ గా పిలుస్తారు.

ఇందులో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. 

నానబెట్టిన వాల్నట్స్ తింటే మెదడు పనితీరు మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఇవి చాలా మంచివి. 

ఉదయాన్నే నానబెట్టిన వాల్నట్స్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

వాల్నట్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సెల్యులార్ డ్యామేజ్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. వృద్దాప్య ప్రక్రియను నెమ్మది చేస్తాయి. 

నానబెట్టిన వాల్నట్స్ సులభంగా జీర్ణం కావడమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.