బ్యాక్ పెయిన్ వేధిస్తోందా..  ఈ టిప్స్ పాటిస్తే నొప్పి పరార్..

బరువైన వస్తువులను పైకి ఎత్తేటపుడు నడుముపై కాకుండా మీ కాళ్లపై ఒత్తిడి పడేలా చూసుకోండి.

నిద్రపోయేటపుడు బోర్లా పడుకోకండి. కడుపుపై కాకుండా మీ వెన్నెముకకు మద్దతు ఇచ్చే భంగిమలో వెల్లకిలా పడుక్కోండి.

కండరాలను రిలాక్స్ చేయడానికి, రక్త ప్రవాహాన్ని పెంచడానికి, నొప్పిని తగ్గించడానికి హీటింగ్ ప్యాడ్ ఉపయోగించండి.

మీ శరీర బరువును నియంత్రణలో ఉంచుకోండి. అధిక బరువు వెన్నెముక, కండరాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.

తేలికైన వ్యాయామాలు లేదా యోగా చేయండి. ముఖ్యంగా స్ట్రెచింగ్ వ్యాయామాలు వెన్ను నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

రోజూ తగినంత శారీరక శ్రమ చేయడం ద్వారా మీ వెన్నెముకను, వెనుక  కండరాలను బలపరుచుకోవచ్చు.