పచ్చి ఉల్లిపాయ తింటున్నారా..  ఈ సమస్యలు గ్యారంటీ

పచ్చి ఉల్లిపాయల్లో పోషకాలు ఉంటాయి. కానీ అవి అందరికీ సరిపోవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి పచ్చి ఉల్లిపాయ తీనకపోవడం ఉత్తమం. వాటిలోని ఫ్రక్టాన్స్ అనే కార్పోహైడ్రేట్ జీర్ణం కావడానికి కష్టమవుతుంది. దీని వల్ల గ్యాస్, కడుపు నొప్పి వంటివి వస్తాయి.

పచ్చి ఉల్లిపాయల్లో వాసన అధికంగా ఉంటుంది. అందుకు సల్ఫర్ పదార్థాలు కారణం. ఇవి రక్తం ద్వారా ఊపరితిత్తుల్లోకి ప్రవేశించి..దుర్వాసనకు కారణమవుతాయి.

కొంతమందికి ఉల్లిపాయల వల్ల అలర్జీ వస్తుంది. చర్మంపై దద్దుర్లు, పెదవులు లేదా నాలుక వాపుతోపాటు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు వస్తాయి.

పచ్చి ఉల్లిపాయలలో రక్తాన్ని పలచబరిచే గుణాలు ఉంటాయి. రక్తస్రావాన్ని నివారించడానికి మందులు వాడే వారు అధికంగా ఉల్లిపాయలు తింటే సమస్యలు వస్తాయి. ఈ కారణంగా డయాబెటిస్ సమస్య ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. 

గుండెల్లో మంట ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలు ఇబ్బంది కలిగిస్తాయి.

వీటిని తీసుకుంటే మైగ్రేన్ రావడానికి కారణమవుతుంది. ఈ సమస్య ఉంటే పచ్చి ఉల్లిపాయల వాడకాన్ని తగ్గించడం మంచింది.

వీటిలో యాంటీబాక్టీరియల్ గుణాలు ఉన్నప్పటికీ.. వాటి రసం దంతాలు, చిగుళ్లకు హాని కలిగిస్తాయి.