పిల్లల దంతాల  ఆరోగ్యం కోసం టిప్స్..

పిల్లలకు పండ్లు, కూరగాయలు తినడం అలవాటు చేయాలి. యాపిల్‌ లాంటి పండ్లతో దంతాలు, చిగుళ్లు శుభ్రపడతాయి.

క్యాల్షియం సప్లిమెంట్లతో దంతాలు దృఢంగా ఉంటాయి.

తీపి పదార్థాలను తగ్గించాలి. తిన్న వెంటనే దంతాలు శుభ్రం చేసుకోవాలి.

కొంతమంది పిల్లలకు నాలుకతో దంతాలను నెట్టే అలవాటు ఉంటుంది. ఈ అలవాటును మాన్పించాలి.

పాల దంతాలు సమయానికి ఊడకపోవడం వల్ల, ఆ ప్రదేశంలో వచ్చే శాశ్వత దంతాలు వంకరగా పెరుగుతాయి.

ఇలా జరగకుండా ఉండాలంటే పాల దంతాలు సరైన సమయంలో ఊడిపోయేలా చూసుకోవాలి.

ఇందుకోసం పిల్లలను దంత వైద్యుల చేత పరీక్ష చేయిస్తూ ఉండాలి.