మీరు బెల్టు టైట్‌గా పెట్టుకుంటున్నారా.. జాగ్రత్త..

పురుషులు.. బెల్టును టైట్‌గా  ధరించకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  

అధిక సమయం బెల్టు టైట్‌గా వేసుకోవడం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. అంతే కాకుండా పొట్టపై నిరంతరం ఒత్తిడి పడుతుంది. తద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. 

ఇది ఫర్టిలిటీ (సంతానోత్పత్తి)పై ప్రభావం చూపుతోందని హెచ్చరిస్తున్నారు. 

బెల్టు‌ టైట్‌గా ధరించడం వల్ల ‌వృషణాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీరంలోని ఈ భాగం చల్లగా ఉండాల్సిన అవసరం ఉంది. 

ఎందుకంటే శుక్రకణాల ఉత్పత్తి సరిగ్గా జరగడానికి ఇది కీలకం. బెల్టు టైట్‌గా పెట్టుకోవడం వల్ల వృషణాల ప్రాంతంలో వేడి ఎక్కువ అవుతుంది. శుక్రకణాల నాణ్యత తగ్గి సంతానం కలగడానికి ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.

బెల్టు టైట్‌గా పెట్టుకోవడం వల్ల మధ్య వైపు భాగానికి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. రక్త ప్రవాహం తక్కువగా ఉండటం వల్ల వృషణాలు ఇతర సంతానోత్పత్తి అవయవాల పని తీరు దెబ్బతింటుంది. ఫలితంగా శుక్రకణాల ఉత్పత్తి తగ్గుతుంది. 

అలాగే పొట్ట కింది భాగం జనన భాగాల్లో ఎక్కువ కాలం ఒత్తిడి వల్ల వాపు, వెరికోసెల్ వంటి సమస్యలు రావచ్చు. ఇవి చివరికి పురుషుల సంతానోత్పత్తిని తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.

టైట్ బెల్టులు ధరించడం వల్ల అరుగుదలకు సంబంధించిన సమస్యలు సైతం వస్తాయి. తద్వారా అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్ తదితర అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. 

ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే సౌకర్యవంతమైన తగిన సైజు కలిగిన బెల్టులు ధరించడం మంచిది.