సాధారణంగా ఒకరిని చూసి మరొకరు ఆవలిస్తుంటారు. ఇలా ఆవలింతలు ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తుంటాయి. ఇలా ఎందుకూ? అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా.

అయితే ఈ కథనం మీ కోసమే. మనిషి మనుగడకు సంబంధించి ఎన్నో మిస్టరీలు ఉన్నాయి.

అలసిపోయినప్పుడో, నిద్ర ముంచుకొస్తున్నప్పుడో, లేదా ఏమీ తోచనప్పుడో ఆవలింతలు వస్తాయని అనుకుంటాం.

కానీ.. అది పూర్తిగా నిజం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రక్రియ అంత కంటే సంక్లిష్టమైనదని చెబుతున్నారు.

ఆవలింతలు మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఉద్దేశించినవి.

మెదడు తీవ్రంగా పని చేస్తున్నట్టు ఉష్ణోగ్రత పెరుగుతుంది.

అలాంటి సందర్భాల్లో ఆవలింతలు వేడిని తగ్గిస్తాయి. మెదడు చల్లబడేలా చేస్తాయి.

ఇక ఆవలింతలు ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తాయో తెలుసుకునేందుకు మ్యూనిచ్‌లోని సైకియాట్రిక్ యూనివర్సిటీ ఆసుపత్రి 2004లో ఓ అధ్యయనం నిర్వహించింది.

మొత్తం 300 మంది పాల్గొన్న ఈ అధ్యయనంలో కనీసం 50 శాతం మంది ఆవలిస్తున్న వారిని చూశాక వారూ ఆవలించారట.

మెదడులోని మిర్రర్ న్యూరాన్ వ్యవస్థ కారణంగా ఇతరులను అనుకరించేందుకు మనుషులు సిద్ధమవుతారని,

ఆవలింతల విషయంలో కూడా ఇదే వ్యవస్థ క్రియాశీలకమవుతుందని పరిశోధకులు తేల్చారు.

మెదడులోని ఈ న్యూరాన్ల కారణంగానే ఆవలిస్తున్న వారిని చూసినప్పుడు మనకూ అసంకల్పితంగా అవి వస్తాయట.