ఈ ఎర్రని పండు తింటే.. శరీరానికి అంతులేని బెనిఫిట్స్..

ఎర్రటి అరటి పండును ఎప్పుడైనా చూశారా? మన దేశంలో అరుదు కానీ.. ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో ఈ అరటి పండుకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.

ఎర్రటి అరటి పండులో కెరోటినాయిడ్లు కారణంగా ఈ పండు పై పొర ( తొక్క) ఎర్రగా ఉంటుంది.

ఈ అరటి పండును తీసుకోవడం వల్ల ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని బీటా కెరోటిన్ కంటి చూపును పెంచుతుంది.

రెడ్ అరటిపండులోని మెగ్నీషియం, పొటాషియం వంటి రిచ్ లక్షణాలు రక్తపోటును తగ్గిస్తాయి.

బరువు తగ్గించుకోవాలని చూసే వారు ఎర్రటి అరటిపండ్లను ఎంచుకోవచ్చు.

ఎర్రటి అరటిపండ్లలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించి, గుండెను బలోపేతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

విటమిన్ సి, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండే ఎర్రటి అరటిపండ్లు మంచి యాంటీఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి,