ప్లేట్ లెట్స్ పెరగాలంటే.. పైసా ఖర్చు లేని పని..

బొప్పాయి కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన పండని ఆరోగ్య నిపుణులు చెబుతారు. 

ఆయుర్వేదంలో బొప్పాయి పండు, దాని ఆకులు, గింజలు సైతం అనేక వ్యాధులకు చికిత్సగా వినియోగిస్తారు.

బొప్పాయి ఆకుల్లో విటమిన్లు ఏ, బీ, సీ, ఈ, కేతో పాటు కాల్షియం, సోడియం, భాస్వరం, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పాపైన్, చైమోపాపైన్, అసిటోజెనిన్లు తదితర బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.

ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.  

డెంగ్యూ వల్ల శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా తగ్గిపోతుంది. బొప్పాయి ఆకుల్లో పపైన్, కైమోపాపైన్ వంటి ఎంజైమ్‌లు ప్లేట్‌లెట్లను పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

ఈ ఆకు రసం జీర్ణవ్యవ్థకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులోని ఎంజైములు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను నియంత్రిస్తాయి. ఈ రసం పేగులను శుభ్రపరచడం, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

ఈ ఆకుల్లో విటమిన్ సీ, ఏతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి.

ఈ ఆకు రసం మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులోని పదార్థాలు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.

ఈ రసం చర్మానికి మేలు చేస్తుంది. ఇది ముడతలు, మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది.

కాలేయానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సిర్రోసిస్, కామెర్లు వంటి కాలేయ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. కాలేయం సరిగ్గా పని చేయడానికి సహాయపడుతుంది.

ఈ రసం శరీరంలోని విషాన్ని తగ్గించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది క్యాన్సర్‌ను నయం చేయక పోయినా.. నివారణలో కీలకంగా పని చేస్తుంది.

ఈ రసంలోని పోషకాలు జుట్టు రాలడాన్ని అరికడుతుంది. చుండ్రను సైతం తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

బొప్పాయి ఆకులను రసంగా లేదా నీటిలో మరిగించి తీసుకోవచ్చు. ఈ రసాన్ని మితంగా తీసుకోవాలి.