రాగి జావలో మెంతులు నానబెట్టి తీసుకుంటే.. ఇన్ని లాభాలా..?

రాగి జావలో మెంతులు నానబెట్టి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

జీర్ణక్రియ మెరుగుదల అవుతుందని అంటే.. మెంతుల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రాగి జావలో మెంతుల కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతుంది. 

వీటిని ఇలా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

రాగిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకుల ఆరోగ్యానికి మంచిది. 

మెంతుల్లో ఫోలిక్ యాసిడ్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ ఏ,బీ6, సీ, కే తదితర పోషకాలు ఉంటాయి.