అరటిపండు తింటే ప్రమాదం.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్త..!

అరటిపండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

 కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు.. ఈ అరటి పళ్లను తినకపోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

అలెర్జీ, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, ఉబ్బసం, జీర్ణ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అరటి పండ్లు హానికరమని పేర్కొంటున్నారు.

మూత్రపిండాల వ్యాధితో బాధపడే వారు సైతం అరటి పండ్లు తినకపోవడం మంచిది.

 అరటి పండు లో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాలపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది.

మలబద్ధక, గ్యాస్ సమస్యలు ఉన్నవారు అరటి పండును ఎక్కువగా తినకూడదు.

అస్తమా రోగులు  అరటి పండును ఎక్కువగా తినకూడదంటున్నారు నిపుణులు.