మీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే..
మీ కాళ్లు, చేతులు ఇలా మారిపోతాయి..
రక్తంలో చెక్కర స్థాయిలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అలా కాకుండా కొన్ని లక్షణాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
మీ రక్తంలో చక్కెర స్థాయిలు సుదీర్ఘ కాలంగా ఎక్కువగా ఉంటే కాళ్లు, చేతుల్లో కొన్ని మార్పులు వస్తాయి. అవేంటో పరిశీలిద్దాం..
నిద్ర లేవగానే నడుస్తున్నప్పుడు పాదాలు, అరికాళ్లు నొప్పి పెడుతున్నాయా? అయితే మీ రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉన్నాయేమో చూసుకోండి..
మీ కాళ్లు, చేతులు తరచుగా తిమ్మిర్లు ఎక్కుతున్నట్టైతే మీ బ్లడ్ షుగర్ చాలా ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి.
కూర్చున్నప్పుడు, నిద్రపోతున్న సమయంలో మీ పాదాల మీద ఏవో పాకుతున్నట్టు, దురద వేస్తున్నట్టు అనిపించినా హై బ్లడ్ షుగర్ కారణం కావచ్చు.
మీ పాదాలకు తగిలిన చిన్న గాయాలు కూడా తగ్గడం లేదా? దానికి కారణం రక్తంలోని అధిక మోతాదులో ఉన్న చక్కెర స్థాయులు కావచ్చు.
కారణం లేకుండా మీ పాదాలు వాచినట్టు కనిపిస్తున్నాయా? ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి.
మీ మోకాళ్లు, జాయింట్స్, పాదాల మీద మచ్చలు కనిపిస్తున్నాయా? అది కూడా బ్లడ్ షుగర్ హైగా ఉందనడానికి ఒక సంకేతం.
మీ అరచేతులు, అరికాళ్లు చల్లగా ఉన్నట్టు అనిపిస్తున్నాయా? దీనికి హై బ్లడ్ షుగర్ కూడా ఓ కారణం కావచ్చు
Related Web Stories
రాత్రి భోజనం ఆలస్యంగా తింటున్నారా.. ఈ సమస్యలు తప్పవు..
ప్రతిరోజు ఈ గింజలను తింటే.. ఈ వ్యాధులన్నీ పరార్..
ఉల్లిని మించి.. ఉల్లి కాడలతో ఎంతో ఆరోగ్యం
పసుపు నీళ్లు తాగడం వాళ్ళ కలిగే ప్రయోజనాలు తెలుసా...