జీడిపప్పులో మోనో అన్ శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలస్ట్రాల్‌ను పెంచుతాయి.
రోజూ జీడిపప్పు తింటే రక్తంలో ట్రై గ్లిజరాయిడ్స్, చెడు కొలస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త నాళాలను వ్యాకోచింపచేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె మీద ఒత్తిడిని తగ్గిస్తుంది.
జీడిపప్పులో పాలీఫినాల్స్, కెరటనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.