అరటి పళ్లు మంచివే కానీ..  ఇలా మాత్రం తినకూడదు..!

అరటి పళ్లలోని ఫైబర్, పోషకాలు అరోగ్యానికి పలు విధాలుగా మేలు చేస్తాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మాత్రం ఇబ్బందులు కలగవచ్చు. 

పరగడుపునే అరటి పండు తింటే రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరిగిపోతాయి. 

ఆయుర్వేదం ప్రకారం.. అరటి పండును పాలతో కలిపి తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యం మొదలవుతుంది.

గర్భవతులు కచ్చితంగా అరటి పళ్లకు దూరంగా ఉండాలి. 

అలాగే సిట్రస్ ఫలాలతో పాటు అరటి పండును తినడం వల్ల పలు అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉంది

మాంసాహారం తీసుకున్నప్పుడు కూడా అరటి పండును తినకూడదు. జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతాయి. 

కారంగా ఉండే చిప్స్, కాఫీ, టీలతో పాటు అరటి పండును తీసుకోవడం కూడా కడుపులో అసౌకర్యానికి కారణమవుతుంది. 

బ్రెడ్, బిస్కెట్లు వంటి బేక్ చేసిన పదార్థాలతో పాటు అరటి పండు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు.