ఆస్తమా లక్షణాల నుంచి ఉపశమనం  కలిగించే ఆహారాలు ఇవే..

విటమిన్-డి స్థాయిలు శరీరంలో తక్కువగా ఉంటే ఆస్తమా  అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది.

సాల్మన్, స్వోర్డ్ ఫిష్ వంటి కొవ్వు చేపలు, పాలు, గుడ్లు, ఆరెంజ్ జ్యూస్ ఎక్కువగా తీసుకుంటే విటమిన్-డి అందుతుంది.

బాదం, హాజెల్ నట్స్, పచ్చి  గింజల్లోని విటమిన్- ఇ..  ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

ఆస్తమా ఉన్నట్లయితే మాత్రం డ్రైఫ్రూట్స్ జోలికి అస్సలు పోకూడదు. వీటికి బదులుగా ఆరెంజ్, యాపిల్స్ వంటి పండ్లు తీసుకోవచ్చు.

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్, గింజలతో పాటూ వారానికి కనీసం రెండుసార్లు చేపలు, చికెన్ తినాలి. 

బీన్స్ తిసుకుంటే కడుపు ఉబ్బినట్టుగా ఉండి, శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉంటుంది. ఇది ఆస్తమా దాడిని పెంచుతుంది.

సాల్మన్, హెర్రింగ్, ట్యూనా, సార్డినెస్ వంటి కొవ్వు చేపల్లోని ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఆస్తమా నుంచి రక్షిస్తాయి.