వేసవిలో కొబ్బరినూనెలో కొన్ని వస్తువులు కలిపి రాయడం వల్ల చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. 

కొబ్బరినూనె చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది. అయితే ఇందులో కొన్ని వస్తువులను కలపడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.

కొబ్బరి నూనెలో కలబంద జెల్ కలిపి రాయడం వల్ల చర్మం మృదువుగా మారడంతో పాటూ మెరుస్తూ ఉంటుంది. 

కొబ్బరి నూనెలో తేనె కలిపి రాయడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది.

నిమ్మరసాన్ని కొబ్బరినూనెలో కలిపి రాయడం వల్ల ముఖంపై టానింగ్ తొలగిపోయి శుభ్రంగా ఉంటుంది.

కొబ్బరినూనెలో గంధం పొడి కలిపి మసాజ్ చేయడం వల్ల చర్మం తాజాగా, చల్లగా ఉంటుంది.

చిటికెడు పసుపును కొబ్బరినూనెలో కలిపి కాస్తే ముఖంపై మొటిమలు తగ్గిపోయి మెరుస్తూ ఉంటుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.