నారింజతొక్కతో  లెక్కలేనన్ని ప్రయోజనాలు.. 

నారింజ పండు ఆరోగ్యానికి చాలా మంచిది.  ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉండటం వల్ల రోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

నారింజ తొక్కను ఆహారంలో తీసుకోవడం వల్ల క్యాన్సర్,  గుండె జబ్బులు, వాపు వంటి సమస్యలు తగ్గుతాయి.

నారింజ తొక్కల నుండి తయారైన సారం గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.

నారింజ తొక్కలో విటమిన్-సి, యాంటీ మైక్రోబయల్, పాలీపెనాల్స్ పుష్కంలగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.

 నారింజ తొక్కలో పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. 

నారింజ తొక్క మధుమేహం ఉన్నవారికి మంచిది. రక్తంలో చక్కెర నియంత్రణలో గొప్పగా సహాయపడుతుంది.

ఆహారంలో నారింజ తొక్క తీసుకుంటే జీవక్రియ వేగం పెరుగుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

 మొటిమలు, జిడ్డు చర్మం చికిత్సలో ఆరెంజ్ తొక్కలు ప్రభావవంతంగా ఉంటాయి.

ఊపిరితిత్తులలో శ్లేష్మం తొలగించడంలో నారింజ తొక్కలు బాగా సహాయపడతాయి.