సపోటా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

సపోటాలోని టానిన్ చర్మంపై ఎరుపు, చికాకు తగ్గిస్తుంది.

సపోటాలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్స్, టాక్సిన్‌లను తొలగించడంలో సాయపడతాయి. 

చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తని పెంచడంలో సాయం చేస్తుంది. 

సూర్యరశ్మి, కాలుష్యం వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

సపోటా తినడం వల్ల చర్మం పొడిబారకుండా, హైడ్రేట్‌గా ఉంచడంలో సాయం చేస్తుంది.

సపోటాలోని జింక్, ఐరన్, ఖనిజాలు.. చర్మంలో దెబ్బతిన్న కణజాలాలను మరమ్మతు చేయడంలో సాయం చేస్తాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.