మట్టితో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మట్టి స్నానం చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.

బురదలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మంలోని అదనపు నూనెను పీల్చుకుని, మొటిమలను నివారిస్తాయి.

చర్మాన్ని నిర్విషీకరణ చేయడంలో మట్టి స్నానం దోహదం చేస్తుంది.

చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడంలోనూ ఇది బాగా పని చేస్తుంది.

మట్టిలోని సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు చర్మ పునరుత్పత్తికి సహకరిస్తాయి. 

బురదలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై తామరను నివారించడంతో పాటూ వాపును తగ్గిస్తాయి.

మట్టి స్నానం చేయడం వల్ల ఎరుపు, వాపు తగ్గడంతో పాటూ వడదెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది.

వృద్ధాప్య లక్షణాలను దూరం చేయడంలో దోహదం చేస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.