ఆకు కూరలు ఆరోగ్యానికి  చాలా మేలు చేస్తాయి.

ఈ విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి ఆకు కూరల్లో ఉల్లి ఆకు కూడా ఒకటి.

ఉల్లిపాయలే కాదు ఉల్లి ఆకులను కూడా ఆహారంగా తీసుకోవచ్చు.

వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఉల్లి ఆకుల్లో ఫినోలిక్ ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు, సల్ఫర్ వంటి సమ్మేళనాలు కనిపిస్తాయి.

ఉల్లి ఆకుల్లో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.

ఉల్లి ఆకులకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

ఉల్లి ఆకులను క్రమంగా తీసుకోవటం వల్ల చర్మాన్ని బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతాయి. జిడ్డు సమస్య కూడా తగ్గుతుంది.