ఆవు పాలు,మేక పాలు  వాటి ప్రయోజనాలు

ఆవు పాలలో ఉండే కొవ్వు పదార్థంతో సమానంగానే మేక పాలలో కూడా ఫ్యాట్ ఉంటుంది.

కొవ్వు గ్లోబుల్స్ ఆవు పాలలో ఉన్న వాటి కంటే చిన్నవిగా ఉండడం వల్ల మేక పాలు త్వరగా జీర్ణమవుతాయి.

మేక పాలు కడుపులోకి వెళ్లిన తర్వాత పెరుగుగా మారుతుంది.

ఈ పెరుగు ఆవు పాలతో చేసిన పెరుగు కంటే మెత్తగా ఉంటుంది. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది.

మేకపాలలో ఫ్యాటీ యాసిడ్స్‌, ఒలిగోశాకరైడ్లు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించి, రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.

మేక పాలు యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో కేన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తాయి.

ఆవు పాలతో పోల్చుకుంటే మేక పాలలో 12 శాతం తక్కువ లాక్టోస్‌ ఉంటుంది. లాక్టోస్‌ సెన్సిటివిటీ ఉన్నవాళ్లు మేకపాలు తాగొచ్చు