జామపండులో విటమిన్ C  పుష్కలంగా ఉంటుంది.

నారింజ పండు కంటే కూడా మూడింతల ఎక్కువ పోషకాలను అందిస్తుంది.

భారతీయ పోషకాహార సంస్థలు, అంతర్జాతీయ పోషక శాస్త్రవేత్తలు జామ పండును అత్యంత ఆరోగ్యకరమైనదిగా గుర్తించాయి.

జామ పండు ప్రేగుల కదలికలను సాఫీగా చేయడంలో సాయపడుతుంది.

ఈ పండులో ఉండే విటమిన్లు, మినరల్సే కాకుండా.. పుష్కలంగా ఉండే ఫైబర్ మలాన్ని మెత్తబరుస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకునే వారు జామపండును తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిస్ ఉన్నవారు కూడా జామ పండ్లను తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.

జామ పండులో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని వైరస్‌‌లు, బ్యాక్టీరియాల నుంచి రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.