మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి.

కర్పూరవల్లి ఆకు మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక గుణాలు కలిగి ఉంటుంది.

ఈ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్ల మోతాదు యాపిల్ కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

రోజుకు 4 కర్పూరవల్లి ఆకులు తినడం ఒక యాపిల్ తినడంతో సమానమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

ఈ ఆకులు శరీరంలోని జీవక్రియను ప్రేరేపించి.. శక్తిని పెంచుతాయి. దీని వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.

నాలుగు కర్పూరవల్లి ఆకులను కొంచెం వేడి చేసి, వాటి రసం తీసి.. తేనె కలిపి తీసుకోవడం వల్ల పొడి దగ్గుకు ఉపశమనం లభిస్తుంది.

ఈ మిశ్రమాన్ని ఖాళీ కడుపుతో 48 రోజులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

రాత్రి పడుకునే ముందు రెండు ఆకులను నమలడం.. తర్వాత వేడి నీరు తాగడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది.