మేక పాలతో గ్యాస్ సహా ఈ సమస్యలు దూరం..!

అందరూ ఆవు లేదా గేదె పాలు తాగుతారు. కానీ, మేక పాలు ఆరోగ్యకరమైనవి. శక్తివంతమైనవి.

మేక పాలలో ప్రొటీన్, ఖనిజాలు, కాల్షియం, భాస్వరం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ బి12 ఉంటాయి. 

కడుపు ఆరోగ్యానికి చాలా మంచివి. సులభంగా జీర్ణమవుతాయి. నొప్పి, మలబద్ధకం లేదా గ్యాస్ సమస్యలను నివారిస్తాయి.

మేక పాలలో కాల్షియం అధికం. ఎముకలు బలపడతాయి. B12 లోపం కూడా తగ్గుతుంది.

చర్మానికి చాలా మంచిది. తెల్లమచ్చలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు రావు.

గుండె ఆరోగ్యానికి మేక పాలు ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్, ఊబకాయాన్ని నియంత్రించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ప్లేట్ లెట్ కౌంట్, రోగనిరోధకశక్తిని పెంచుకునేందుకు మేక పాలు తాగవచ్చు.

మేక పాలను మరిగించాక మాత్రమే తాగాలి. ఎక్కువ పరిమాణంలో తాగితే హానికరం. ఏదైనా నిర్దిష్ట వ్యాధి ఉంటే వైద్యుడి సలహా తీసుకోండి.