పిల్లల ఏడుపు మాన్పించేందుకు  తల్లిదండ్రులు చాక్లెట్లు ఇస్తుంటారు

చాక్లెట్ ఎక్కువ తినడం వల్ల పంటి సమస్యలతో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.

చాక్లెట్‌ లో కాలరీలు ఎక్కువగా ఉంటాయి కానీ పోషకాలు తక్కువ. దీని వల్ల పిల్లలు వేగంగా బరువు పెరుగుతారు.

అధిక చక్కెర కలిగిన చాక్లెట్‌లు తినడం వల్ల బరువు పెరిగి, అది ఇన్సులిన్ నిరోధకతను పెంచి టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది

చాక్లెట్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ చక్కెర గుండెకు హాని చేస్తాయి.  రక్తపోటును పెంచి ధమనుల్లో అడ్డుపడేలా చేస్తుంది.

చాక్లెట్లలో ఉండే సీసం, కాడ్మియం వంటి హానికరమైన లోహాలు మూత్రపిండాలతో సహా శరీరంలోని ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తాయి.

చాక్లెట్‌లో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ ఆలస్యం కావొచ్చు,

చాక్లెట్ అలవాటు క్రమంగా తగ్గించి వారి భవిష్యత్తును సురక్షితంగా మార్చండి.